![]() |
![]() |
.webp)
ఆలీతో సరదాగా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి శివాజీ గెస్ట్ గా వచ్చాడు. ఆలీ ఆయన లైఫ్ ఎదుర్కున్న ఎన్నో బాధల్ని తెలుసుకున్నారు. శివాజీ కూడా చాలా విషయాలను చెప్పుకొచ్చాడు ఈ ప్రోమోలో. "ఉదయ్ కిరణ్ కి, తారక రత్నకి, ప్రభుదేవాకి డబ్బింగ్ చెప్పాను. అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీకి , నితిన్ దిల్ మూవీకి నేనే డబ్బింగ్ చెప్పా. దానికి నాకు నంది వచ్చింది. లైఫ్ చాలా దారుణమైన పరిస్థితిలో వెళ్తోంది ఆ టైములో .. పాపం మా నాన్న కూడా మమ్మల్ని చదివించడానికి, బతకడానికి, బతికినదానికి అప్పులయ్యి చాలా ఇబ్బందులు పడ్డాం. అంతకు మించి ఇంకేం ఉండదు రైతుకు...అప్పుడు అర్ధమయ్యింది లైఫ్. బాధ్యత తీసుకోవడానికి సిద్దపడి వచ్చా హైదరాబాద్. నరసారావు పేట వెళ్లి 9 వ తరగతి చదవాలన్నప్పుడు చెప్పులు కొన్నారు నాకు. కార్ కొనుక్కుని వెళ్ళడానికే ఫిక్స్ అయ్యి వచ్చా.
ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే రాజకీయం చేయాలి...యాక్టింగ్ కి దూరంగా ఉన్న చాలా ఏళ్లకు రీసెంట్ గా 90s మూవీ ఎలా వచ్చింది అంటే...ఒకసారి నాకు బాపినీడు గారిని కలవాలనిపించింది.. ఈ మూవీ ఆఫర్ వచ్చిందని చెప్తే అది ఆపొద్దు చెయ్యి అన్నారు. ఈ ఒక్క వెబ్ సిరీస్ కి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.. కానీ ఒక కూతురు ఉందని అంటారు..మరి ఆ విషయం నాకు తెలీదు. ఎవరైనా తెచ్చిస్తే పెంచుకుంటాను సంతోషంగా. వేషం మార్చి దుబాయ్ లో దొరికిపోయిన శివాజీ అనే టైటిల్స్ ని కూడా చూసాను" అంటూ శివాజీ తన జీవితంలోని ఎత్తుపల్లాలను అనుభవించిన కష్టాలను ఈ షోలో చెప్పాడు. ఇంకా ఎలాంటి ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పాడో తెలియాలి అంటే ఈ షో కోసం కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.
![]() |
![]() |